Narsapur Constituency

Narsapur Constituency నర్సాపూర్ నియోజకవర్గం వార్తలు, స్థానిక విషయాలు, ప్రజల అభిప్రాయాలు. Narsapur is one of the major towns in Medak district, Telangana, India.
(2)

It is located 60 km north of Hyderabad.

04/08/2026

Narsapur Forest: Your Weekend Getaway near Hyderabad (14 KM from ORR)

22/06/2026

Chakarimetla Sri Sahakara Anjaneya Swamy Temple
🚩🔱

31/05/2026

30/05/2026

800 లారీలు అవసరం ఉంటే కేవలం 200 మాత్రమే వచ్చాయి - Vakiti Sunitha Laxma Reddy

మెదక్ డీఆర్వోగా అంబదాస్ రాజేశ్వర్ బాధ్యతలు మెదక్ జిల్లా రెవెన్యూ అధికారిగా (DRO) జి. అంబదాస్ రాజేశ్వర్ సోమవారం బాధ్యతలు ...
11/05/2026

మెదక్ డీఆర్వోగా అంబదాస్ రాజేశ్వర్ బాధ్యతలు
మెదక్ జిల్లా రెవెన్యూ అధికారిగా (DRO) జి. అంబదాస్ రాజేశ్వర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఆయన, బదిలీపై వెళ్ళి తిరిగి సివిల్ సప్లై శాఖ నుండి ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్ ప్రతిమా సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

జిల్లాలో ఇంటింటి జనగణన సర్వే ప్రారంభంమెదక్: జిల్లావ్యాప్తంగా 1,68,677 ఇళ్లలో సోమవారం నుంచి జనగణన ఇళ్ల జాబితా నమోదు ప్రక్...
11/05/2026

జిల్లాలో ఇంటింటి జనగణన సర్వే ప్రారంభం
మెదక్: జిల్లావ్యాప్తంగా 1,68,677 ఇళ్లలో సోమవారం నుంచి జనగణన ఇళ్ల జాబితా నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకోసం 1,439 మంది ఎన్యూమరేటర్లు, 261 మంది సూపర్‌వైజర్లను అధికారులు నియమించారు. ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి బ్లాక్ నంబర్ల కేటాయింపుతో పాటు మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయనున్నారని అధికారులు వెల్లడించారు.

పంట అవశేషాలు కాల్చొద్దు: రైతులకు హెచ్చరికవరి కోతల అనంతరం పొలాల్లో పంట వ్యర్థాలను కాల్చవద్దని అధికారులు రైతులను హెచ్చరించ...
11/05/2026

పంట అవశేషాలు కాల్చొద్దు: రైతులకు హెచ్చరిక
వరి కోతల అనంతరం పొలాల్లో పంట వ్యర్థాలను కాల్చవద్దని అధికారులు రైతులను హెచ్చరించారు. దీనివల్ల గాలి కాలుష్యం పెరగడమే కాకుండా భూసారం తగ్గి సూక్ష్మజీవులు నశిస్తాయని తెలిపారు. అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, వ్యర్థాలను తగులబెట్టకుండా రోటవేటర్‌తో నేలలో కలపాలని లేదా పశుగ్రాసంగా మార్చుకోవాలని సూచించారు.

మత్స్య కార్మికులకు ప్రభుత్వం పెద్దపీట: మెదక్ అదనపు కలెక్టర్ నగేష్RBC News Medak: మెదక్ కలెక్టరేట్‌లో మత్స్యకారుల కోసం ప్...
08/05/2026

మత్స్య కార్మికులకు ప్రభుత్వం పెద్దపీట: మెదక్ అదనపు కలెక్టర్ నగేష్

RBC News Medak: మెదక్ కలెక్టరేట్‌లో మత్స్యకారుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. మత్స్య సంపదను పరిరక్షించడం ద్వారా మత్స్యకారుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని అదనపు కలెక్టర్ నగేష్ పేర్కొన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులతో కలిసి మత్స్యకారుల సంక్షేమంపై చర్చించారు.

ధాన్యం కొనుగోలు, రవాణాలో అలసత్వం వద్దు: అదనపు కలెక్టర్ నగేష్ హెచ్చరికధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం, రవాణా ప్రక్రియను ...
08/05/2026

ధాన్యం కొనుగోలు, రవాణాలో అలసత్వం వద్దు: అదనపు కలెక్టర్ నగేష్ హెచ్చరిక

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం, రవాణా ప్రక్రియను మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. కొడిపల్లి మండలం మహ్మద్ నగర్ వద్ద రవాణా ఏర్పాట్లను పరిశీలించి, ధాన్యం ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు.

Address

Narsapur, Medak
Narsapur
502313

Website

Alerts

Be the first to know and let us send you an email when Narsapur Constituency posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Narsapur Constituency:

Shortcuts

Share